Andhra PradeshHome Page Slider

ఏపీలో పలు సంస్కరణలకు ఆమోదం తెలిపిన జగన్ సర్కార్

Share with

ఏపీ సర్కార్ ఈ రోజు సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో పలు సంస్కరణలకు ఆమోదం తెలిపింది.ఈ మేరకు కోర్టుల్లో పనిచేసే సిబ్బంది,పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ,డీఆర్ చెల్లించాలని ఆమోదించింది. ఏపీలో సీఐడీ ఆఫీసు కోసం రాయనపాడులో 20 సెంట్ల స్థలాన్ని కేటాయించింది. తాడేపల్లి గూడెంలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టుకు ఆమోదం పలికింది. విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్ట్ డీపీఆర్‌కు ఆమోదం ప్రకటించింది.మొత్తంగా విశాఖలో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ఆమోదం తెలియజేసింది. కాగా రాష్ట్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతను అమలు చేస్తామని హామి ఇచ్చింది. ఏపీలో జనవరిలో వైస్సార్ ఆసరా,చేయూత పథకాల అమలు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఆరోగ్య శ్రీ చికిత్స పరిధి రూ.25లక్షలకు పెంచుతున్నట్లు పేర్కొంది.అంతేకాకుండా రాష్ట్రంలో సామాజిక పెన్షన్లను రూ.3000లకు పెంచేందుకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.