Andhra PradeshHome Page Slider

ఎర్రచందనం స్మగ్లింగ్‌లో జబర్జస్త్ నటుడు

Share with

చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు పోలీసులు. చిత్తూరు జిల్లా పుంగనూరులో దాదాపు 60 లక్షల విలువ చేసే ఎర్రచందనం లభ్యమయ్యింది. 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. జబర్జస్త్ కామెడీ షోలో     ఆడవేషంతో పాపులర్ అయిన హరి ఇప్పుడు ఎర్రచందనం కేసులో కూడా ఇరుక్కున్నాడు. ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని ఈ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నాడు హరి. ఈ హరిపై ఇప్పటికే అనేక కేసులు నడుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న హరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.