Home Page SliderTelangana

తెలంగాణాలో ఎన్నికలకు వేళాయే..!

Share with

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేంద్ర ఎన్నికల బృందం నేడు హైదరాబాద్‌లో పర్యటించనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల బృందం ఇవాళ మధ్యహ్నం 2:30 గంటలకు రాజకీయ పక్షాలతో భేటీ నిర్వహించనుంది. ఈ భేటీలో ఈసీతో 10 రాయకీయ పక్షాలు పాల్గొననున్నాయి. కాగా ఈ భేటీకి ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ఎన్నికల బృందం మూడు రోజులపాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్టోబర్ రెండో వారంలో తెలంగాణా ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసే అవకాశం కన్పిస్తుంది. మరోవైపు తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115మంది అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ మంత్రులు కేటీఆర్,హరీశ్ రావు ప్రచార సభల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.అయితే ప్రతి పక్ష పార్టీలు మాత్రం ఇప్పటివరకు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించకపోవడం గమనార్హం.