Home Page SliderTelangana

మల్కాజిగిరి అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి తరఫున ప్రచారంలో ఈటల

Share with

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: మేడ్చల్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్ధి ఏనుగు సుదర్శన్ రెడ్డి గారి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్, చాడ సురేష్ రెడ్డి.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ: డబ్బులు ఖర్చుపెట్టు.. గెలువు.. సంపాదించు.. అన్నట్టు రాజకీయాలు తయారయ్యాయి. దీన్ని బొమ్మాట్ చెయ్యాలి. మన సమస్యలు తీర్చేవారిని ఎన్నుకోవాలి. సీఎం ఈ రూట్లో వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఒక్కరోజు అయినా శామీర్‌పేటలో ఆగాడా. మనల్ని కలిశాడా? సమస్యలు విన్నాడా? ప్రజలను కలవని ముఖ్యమంత్రి కెసిఆర్. కనీసం ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా కలవడు.

కొత్త సచివాలయం కట్టుకున్నా ఒక్క రోజు రాలే. మనల్ని కలవని, మనల్ని పట్టించుకోని కేసిఆర్‌ను మళ్లీ గెలిపిద్దామా? మల్లారెడ్డికి ఓటు వేస్తె కేసిఆర్ ముఖ్యమంత్రి అవుతారు. సుదర్శన్ రెడ్డికి ఓటు వేస్తే మీకు అందుబాటులో ఉంటారు. సుదర్శన్ రెడ్డికి ఓటు వేయడం అంటే ధర్మానికి ఓటు వేయడం. అహంకారాన్ని అణచివేయడం. బొమ్మరాజుపేటలో భూములు అన్నీ గుంజుకొని పెద్దలకు కెసిఆర్ కట్టబెడుతున్నారు. నేను గజ్వేల్‌కి వస్తున్నా అని తెలవగానే కెసిఆర్ కామారెడ్డికి పారిపోయాడు. గజ్వేల్‌లో గెలిచేది ధర్మమే.

నరేంద్ర మోడీ గారి అండతో మీకు హామీ ఇస్తున్నా..

• ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్య ఉచితంగా  అందిస్తాం.

• ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తాం.

• నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తాం.

• ఇద్దరు ముసలి వాళ్లకు పెన్షన్ అందిస్తాం.

• డబుల్ బెడ్ రూం ఇళ్లు అర్హులందరికీ ఇస్తాం.

కేసిఆర్ చెంప చెళ్లుమనిపించేలా తీర్పు ఇవ్వండి. ఆకలి తెలిసిన వాళ్ళం అధికారంలోకి వస్తే మీ బాధలు అన్నీ తీరుస్తాము.

ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ: ఈటల రాజేందర్ అన్న అడుగుపెట్టిండు మన గెలుపు ఎవరూ ఆపలేరు. కెసిఆర్‌ది రాక్షస పాలన. మల్లారెడ్డి స్థానికుడు కాదు. కబ్జాదారుడు. కోట్లు పెట్టీ టికెట్ కొనుక్కుంటున్నారు. మళ్లీ సంపాదించుకుంటున్నారు.

రాష్ట్రంలో అత్యధిక రైతుబందు తీసుకుంటున్న వాడు మల్లారెడ్డి. డబుల్ బెడ్ రూం స్థానికులకు కాకుండా కమీషన్ కోసం బయటివారికి ఇచ్చారు. ఒక్క జూనియర్, డిగ్రీ కాలేజీ కూడా ఇక్కడ పెట్టలేదు. నేను సమస్యల కోసం కొట్లాడిన బిడ్డను. ప్రజల పక్షాన ఉన్నాను. బంగారు భవిష్యత్తు కావాలంటే బిజెపికి ఓటు వేయండి. మల్లారెడ్డి విద్య, వైద్యం వ్యాపారం చేస్తున్నారు తప్ప ఉచితంగా పేదలకు అందించే ఏర్పాటు చేయలేదు.