Andhra PradeshHome Page Slider

డిప్రెషన్ నుండి కోలుకోడానికి 4 ఏళ్లు వేస్టైంది: ఐరా ఖాన్

Share with

డిప్రెషన్‌లో ఉన్నప్పుడు తాను ఎలా ఎదుర్కొన్నానో ఐరా ఖాన్ తెలిపారు. ఈ విషయంలో నుపుర్ తనకెంతో అండగా నిలిచాడని ఆమె అన్నారు.

ముంబై: బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ కుమార్తెగా సినీ ప్రియులకు సుపరిచితురాలయ్యారు ఐరా ఖాన్. గత కొన్నేళ్లుగా మానసిక కుంగుబాటుతో ఇబ్బంది పడుతోన్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నానని ఆ బాధ నుండి కోలుకోడానికి నాలుగేళ్లు పట్టిందన్నారు. కుటుంబసభ్యులు, ముఖ్యంగా నుపుర్ తనకు ఎంతో అండగా నిలిచారని తెలిపారు.

      కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే నాకు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎదురయ్యాయని గుర్తించా. మొదట పెద్దగా పట్టించకోలేదు. కానీ రాను రాను పరిస్థితి మరింత దారుణంగా మారింది. తినడం కూడా మానేశా. నా పరిస్థితి గురించి చెప్పి కుటుంబసభ్యుల సాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నా. అలా, ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పా. వాళ్లెంతో కంగారుపడ్డారు. ప్రతిక్షణం నాకు అండగా నిలిచారు. ముఖ్యంగా నాకు కాబోయే భర్త నుపుర్ క్లిష్ట పరిస్థితుల్లో నన్ను అర్థం చేసుకుని ధైర్యం చెప్పాడు. మూడేళ్ల నుంచి మందులు.. ఐదేళ్ల నుంచి థెరపీ తీసుకుంటున్నప్పటికీ.. నేను డిప్రెషన్‌తో బాధపడుతున్నానని పూర్తిగా కోలుకోడానికి నాలుగేళ్లు పట్టిందన్నారు. గతేడాది నుంచి నేను దాన్ని అంగీకరిస్తున్నా.. అని ఐరా ఖాన్ తెలిపారు.