Home Page SliderNational

‘జోషిమఠ్’ కుంగుబాటుపై ‘ఇస్రో’ సంచలన రిపోర్టు

Share with

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం జోషిమఠ్ రోజురోజులో క్రుంగిపోతోంది. గత 12 రోజుల్లో దాదాపు 5. 5 సెంటీమీటర్ల మేర క్రుంగిపోయింది. అక్కడి వారిని ఇప్పటికే ఖాళీ చేయించిన సంగతి మనకు తెలిసిందే. ఈప్రదేశంలో 560 ఇళ్లకు పైగా పగుళ్లు ఏర్పడ్డాయి. దీనితో దాదాపు 70 కుటుంబాలు అక్కడి నుండి వలస వెళ్లారు. వారిని సురక్షిత శిబిరాలలో ఉంచారు. ఇక మిగిలిన ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అక్కడ భూములు క్రమక్రమంగా కుంగిపోతున్నాయి. 15 రోజులుగా పగుళ్లు ఎక్కువయ్యాయని జోషిమఠ్ నిర్వాహకులు చెప్తున్నారు.

జోషిమఠ్ మాత్రమే కాక ఉత్తరాఖండ్‌లోని మరిన్ని ప్రాంతాలు భూమిలో కుంగిపోతున్నట్లు డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ తెలిపింది. గత మూడేళ్లుగా ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి, ఇక్కడి లోయప్రాంతాలు మెల్లగా భూమిలోకి చొచ్చుకొని పోతున్నట్లు కనిపెట్టింది. జోషిమఠ్ కుంగుబాటుకి కారణం ఎన్టీపీసీ ప్రాజెక్టు అంటూ ఆరోపణలు వచ్చాయి.

తాజాగా ఇస్రో కూడా జోషిమఠ్‌పై నివేదిక విడుదల చేసింది. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉపగ్రహ చిత్రాలను కూడా విడుదల చేసింది. జోషియఠ్- అవులి రహదారిలో 2180 మీటర్ల ఎత్తులో ప్రమాద పరిస్థితులు ఉన్నాయని ఈ నివేదికలో వెల్లడయ్యింది. ఏటా ఉత్తరాఖండ్‌లోని పలు పట్టణాలలో భూమి కుంగిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పౌరి, రుద్రప్రయాగ్, టిహరి గఢవాల్, భాగేశ్వర్, ఉత్తరకాశీ మొదలైన ప్రాంతాలు ఇదే దుస్థితిలో ఉన్నాయి. జోషిమఠ్ పరిస్థితి చూసిన ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు.