Andhra PradeshHome Page Slider

శ్రీకాళహస్తిలో ‘చంద్రయాన్‌-3’ కోసం ఇస్రో శాస్త్రవేత్తల పూజలు

Share with

పట్టు వదలకుండా చందమామను శోధించాల్సిందేననే ఉద్దేశంతో ఇస్రో మరోసారి చంద్రయాన్ ప్రయోగానికి సిద్ధమయ్యింది. చంద్రయాన్ 2 ప్రయోగం ఆశించిన విధంగా విజయవంతం కాకపోవడంతో ఈ ప్రయోగం సక్సెస్ కావాలంటూ శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలో పూజలు నిర్వహించారు ఇస్రో శాస్త్రవేత్తలు. అంతకు ముందుగానే తిరుపతి ఆలయంలో కూడా చంద్రయాన్ 3 మోడల్‌తో పూజలు నిర్వహించారు. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఈ ప్రయోగానికి నేడు కౌంట్ డౌన్ మొదలయ్యింది. ఇది 25 గంటల పాటు కొనసాగి, శుక్రవారం మధ్యాహ్నం 2.35 నిముషాలకు నింగిలోకి దూసుకెళుతుంది. ఎల్‌వీఎం3-ఎం4 అనే భారీ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం చేపడుతున్నారు. దీనికి కూడా చంద్రయాన్ 2 లాగానే ల్యాండర్, రోవర్ ప్రొపల్షన్ మాడ్యూల్‌లో అనుసంధానం చేశారు. ఇది చంద్రునిలోని దక్షిణ ధృవంలో ల్యాండ్ అవుతుందని ఇస్రో తెలియజేసింది. అయితే దీనిలో చంద్రుని కక్ష్యలో తిరుగాడే ఆర్భిటర్‌ను పంపడం లేదు. గతంలో చంద్రయాన్ 2తో పంపిన ఆర్భిటర్ చంద్రుని కక్ష్యలోనే తిరుగుతోంది. దీనినే చంద్రయాన్ 3 రోవర్‌కు అనుసంధానిస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.