Home Page SliderInternational

ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ సమాజం సపోర్ట్ లేదు: జోబైడెన్

Share with

ఇజ్రాయెల్ విషయంలో అమెరికా స్వరంలో తొలిసారి మార్పు కనిపించింది. గాజాలో బాంబింగ్ కారణంగా టెల్ అవీవ్ అంతర్జాతీయ మద్దతు కోల్పోవడం మొదలైందని బైడెన్ వ్యాఖ్యానించారు.

ఆయన కఠిన పదజాలంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును హెచ్చరించారు. ఇజ్రాయెల్‌కు ప్రస్తుతం అమెరికా, ఐరోపా సమాఖ్య సహా ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఉందని.. కానీ, క్రమంగా దానిని కోల్పోవడం మొదలైందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా విచక్షణారహితంగా చేస్తున్న బాంబింగే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. దీర్ఘకాలిక పరిష్కారానికి నెతన్యాహు ప్రభుత్వం అడ్డుపడుతోందన్నారు. కొన్ని విషయాలను బీబీ (నెతన్యాహు నిక్‌నేమ్) అర్థం చేసుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఆయనతో ఇప్పటికే పలుమార్లు మాట్లాడాను. ఇజ్రాయెల్ రక్షణ బాధ్యత అమెరికాతో ముడిపడి ఉంది. అమెరికా 9 బై 11 దాడుల అనంతర పరిణామాల నుండి ఇజ్రాయెల్ పెద్దగా నేర్చుకోలేదని బైడెన్ అభిప్రాయపడ్డారు.