InternationalNews

బ్రిటన్ పార్లమెంటులో ప్రసంగించిన ‘ఐరా’ రోబో

Share with

ఆధునిక కాలంలో సాంకేతిక నైపుణ్యం కొత్తపుంతలు తొక్కుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌, మానవ మేథతో సమానంగా పోటీ పడుతోంది. అక్టోబరు 12 యునైటెడ్ కింగ్‌డమ్ (UK) చరిత్రలో మొదటిసారిగా పార్లమెంటులో రోబో ప్రసంగించింది. మానవ రూపంలో ఉన్న రోబోలు ఇప్పటికే బోస్టన్ డైనమిక్స్‌కు చెందిన రోబో శునకం, హాంకాంగ్‌కు చెందిన రోబో సోఫియా ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. తాజాగా ఈ వరుసలో ఐడా అనే రోబో కూడా చేరింది. ఈ రోబోను 2019లో ఐడాన్ మెలెర్ అనే బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త  రూపొందించారు. దీనిని అడా లవ్‌లేస్ పేరిట ఐడా అని పిలుస్తున్నారు.

ఈ రోబో బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ తనకు జీవం లేకపోయినా కళను ఉత్పత్తి చేయగలుగుతానని పేర్కొంది. మనుషులకు ఉన్న ఆలోచనా శక్తి తనకు లేదని అయినా ఊహాశక్తితో కళను చిత్రించగలను అని వెల్లడించింది. అయితే ఈ ప్రసంగంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. సాంకేతిక లోపం వల్ల ప్రసంగం మధ్యలో ఐరాకు మెల్లకన్ను ఏర్పడింది. దీనితో మనుషులతో కలిసి రోబోలు కూడా మానవ సమాజంతో కలిసి నడిచేవిధంగా పరిజ్ఞానం అభివృద్ధి చెందుతోందని భావించవచ్చు.