Home Page SliderNational

జోరుగా సాగుతున్న ఐపీఎల్ వేలం-భారీ ధరలకు స్టార్ ప్లేయర్లు

Share with

ఐపీఎల్ సీజన్ మొదలు కాబోతోందంటేనే క్రికెట్ ప్రియులకు పండుగ. దేశ, విదేశాలకు చెందిన స్టార్ ప్లేయర్లను వేలంలో దక్కించుకోవడానికి టీమ్స్ పోటీలు పడుతున్నారు. పోటా పోటీగా వేలంపాటలు పాడి ఆటగాళ్ల రేటును పెంచేస్తున్నారు. మొట్టమొదటగా వేలానికి వచ్చిన వెస్టిండీస్‌కు చెందిన రోమన్ పావెల్ కోటి రూపాయల కనీస ధరతో వచ్చాడు. ఇతనిని కోల్‌కత్తా, రాజస్థాన్ పోటీలు పడి చివరికి రూ. 7.4 కోట్లకు రాజస్థాన్ దక్కించుకుంది. ఈ వేలంలో భారత్ బౌలర్ హర్షల్ పటేల్‌ను పంజాబ్ కింగ్స్ రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల ప్రారంభ ధరతో వచ్చిన ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ను ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ తీవ్రంగా పోటీలు పడి, రూ.20.5 కోట్ల కళ్లు చెదిరే ధరకు ఎస్‌ఆర్‌హెచ్ దక్కించుకుంది. ఇప్పటి వరకూ ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర. కివీస్‌ టాప్ బ్యాటర్ డారెల్ మిచెల్‌ను చెన్నై, పంజాబ్ పోటీలు పడి చివరికి చెన్నై రూ.14 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. సెట్ 1లో ముగ్గురు బ్యాటర్లు మాత్రం అమ్ముడుపోకుండా నిలిచిపోయారు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, భారత్ ఆటగాళ్లు మనీష్ పాండే, కరుణ్ నాయర్ అన్ సోల్డ్‌గా మిగిలారు. సెట్ 2 వేలం  కొనసాగుతోంది.