Home Page SliderInternational

ఆస్కార్ నుండి రాజమౌళి దంపతులకు ఆహ్వానం

Share with

ఆస్కార్ అకాడమీ నుండి రాజమౌళి,రమా రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం లభించింది. వారిద్దరినీ అకాడమీలో సభ్యులుగా చేర్చుకునేందుకు అకాడమీ ఆహ్వానం పంపింది. దర్శకులు కేటగిరీలో రాజమౌళికి, కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిరీలో రమారాజమౌళికి ఈ గౌరవం దక్కింది. ఈ సంవత్సరం 57 దేశాల నుండి 487 మందికి సభ్యులుగా చేర్చుకునేందుకు ఆస్కార్ అకాడమీ స్వాగతించింది. భారత్ నుండి వీరిద్దరితో పాటు బాలీవుడ్ నుండి షబానా అజ్మి, రితేశ్ సిద్వానీ వంటి వారు కూడా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన కళాకారులు, నిపుణులకు అకాడమీ స్వాగతం అంటూ ఆస్కార్ అకాడమీ పోస్టు చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడంతో ఇప్పటికే ఈ చిత్రంలో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్, సంగీతదర్శకుడు కీరవాణి, సెంథిల్ కుమార్ అకాడమీలో సభ్యత్వం సాధించారు.