Home Page SliderInternational

గాయాలపాలైన నటి ప్రియాంకచోప్రా

Share with

గ్లోబల్ స్టార్ ప్రియాంకచోప్రా షూటింగ్ చిత్రీకరణ సమయంలో గాయాలపాలయ్యారు. ఈమె నటిస్తున్న ‘ది బ్లఫ్’ అనే హాలీవుడ్ చిత్ర షూటింగులో ఈ గాయాలు ఏర్పడినట్లు ఆమె వెల్లడించింది. వృత్తి జీవితంలో ప్రమాదాలు అంటూ గాయపడిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసుకుంది. ఆమె ముఖం, మెడ, పెదవిపై తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందో సరైన సమాధానం లేదు. ఈ చిత్రాన్ని అవెంజర్స్ చిత్రాన్ని నిర్మించిన రుస్సో బ్రదర్స్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరణ జరుపుకుంటున్నప్పటికీ ఈ చిత్ర షూటింగులో గాయాలపాలయ్యింది ప్రియాంక. ఆమె ఈ చిత్రంతో పాటు హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే మరో యాక్షన్ కామెడీ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.