Home Page SliderInternational

చైనా బొమ్మలకు భారత్ చెక్

Share with

సరైన క్వాలిటీ లేని వస్తువులను “చైనా సరుకా” అని అడగడం మనకు పరిపాటే. ఈ చైనా కంపెనీలు పిల్లలు ఆడుకునే బొమ్మల తయారీలో కూడా ప్రవేశించాయి. సరైన నాణ్యత లేకుండా చవకబారు ప్లాస్టిక్‌తో చేసే బొమ్మలు పిల్లలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి.  క్వాలిటీ సర్టిఫికేట్ లేకుండా ఇష్టారాజ్యంగా భారత్‌లో చైనా బొమ్మలు అమ్మేస్తున్న 160 చైనా కంపెనీలపై ప్రభుత్వం కన్నెర్రజేసింది. ఈ కంపెనీలకు తగిన నాణ్యతా ధృవీకరణ పత్రాలను జారీ చేయలేదని పేర్కొంది. ఎవరైనా మేడిన్ చైనా బొమ్మలను విక్రయిస్తుంటే వినియోగదారులను ఫిర్యాదు చేయమని బీఐఎస్ క్వాలిటీ చెకింగ్ అధికారులు తెలియజేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా చైనాకు వెళ్లి, ఆయా కంపెనీల నాణ్యతా ప్రమాణాలను గుర్తించలేదని అందుకే చైనా కంపెనీలకు బిఐఎస్ సర్టిఫికేట్లు ఇవ్వలేదని తెలిపారు. గత రెండేళ్లలో కేవలం 29 విదేశీ బొమ్మల తయారీదారులకు మాత్రమే ఈ నాణ్యతా ధృవీకరణ పత్రాలను ఇచ్చామని తెలియజేశారు. బొమ్మల నాణ్యత విషయంలో విమానాశ్రయాలు, మాల్స్‌ లో ఉన్న బొమ్మల దుకాణాలపై దాడులు చేసి నకిలీ లైసెన్సులతో బొమ్మలు విక్రయించడాన్ని అరికట్టామని అధికారులు తెలిపారు.