Home Page SliderInternational

‘బాస్టిల్ డే పరేడ్‌’లో భారత బృందాలు –గౌరవ అతిథిగా మోదీ

Share with

ఐరోపాలోనే అతిపెద్ద సైనిక కవాతుగా నిలిచిన బాస్టీల్ డే పరేడ్‌లో భారత సేనలు కూడా పాల్గొన్నాయి. భారత సాయుధదళాలకు చెందిన 269 మంది సభ్యుల బృందంలో నాలుగు రఫేల్ విమానాలు, 2 సీ-17 గ్లోబ్ మాస్టర్లు కూడా ఉన్నాయి. ఇవి పారిస్ గగన తలంలో తమ విన్యాసాలు ప్రదర్శించాయి.

ఈ పరేడ్ చాలా బాగా జరిగిందని, భారత్‌తో స్నేహ సంబంధాలు ఫ్రాన్స్‌కు ఎంతో సంతోషంగా ఉందని, భారత్‌ను అతిథిగా ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ వ్యాఖ్యానించారు. దీనికి జవాబుగా మోదీ కూడా ఈ సంబరాలపై ఫ్రాన్స్- భారత్ సంబంధాలపై ట్వీట్ చేశారు. 140 కోట్ల మంది భారతీయులు ఫ్రాన్స్ భారత్ సత్సంబంధాలపై సంతోషంగా ఉన్నారని మోదీ ట్వీట్ చేశారు.