Home Page SliderNational

IPL బదులుగా భారత న్యాయ సంహిత- సత్వర న్యాయం

Share with

బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో కేంద్రప్రభుత్వం భారత న్యాయ సంహిత చట్టాన్ని జూలై 1 నుండి అమలులోకి తెచ్చింది. వీటితో బాధితులు సత్వర న్యాయం పొందే అవకాశాలు ఉన్నాయి. భారత్ న్యాయ సంహితతో పాటు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం కూడా అమలులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఈ నూతన చట్టాల అమలుకు పోలీస్ యంత్రాంగం సిద్ధమయ్యింది. నెల రోజులుగా ఈ వ్యవస్థపై శిక్షణ జరుగుతున్నాయి.

చిన్న నేరాలకు జరిమానాలు బాగా పెరగనున్నాయి. ఘర్షణ కేసుల్లో కూడా జరిమానా రూ.20 వేలకు, జైలుశిక్ష కూడా పడనుంది.

ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో సందేహాలు ఉంటే డీఎస్పీ అనుమతితో మళ్లీ దర్యాప్తు చేయవచ్చు. ఈ కేసులను 14 రోజుల లోపల విచారణ చేయవలసి ఉంటుంది. ఆధారాలు లభ్యమయితే కేసును నమోదు చేయవచ్చు. లేదంటే మూసివేయవచ్చు.

జీరో ఎఫ్‌ఐఆర్ సౌకర్యంతో దేశంలో ఎక్కడ నేరం జరిగినా బాధితులు సమీపంలోని పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేయవచ్చు. దీనితో ఆ కేసును ఇంటర్నెట్ ద్వారా ఎక్కడికైనా బదిలీ చేయవచ్చు.

33 కేసుల్లో శిక్షలు పెరిగాయి. 83 నేరాల్లో జరిమానాలు పెరిగాయి.

ప్రమాదాలలో బాధితుల వైద్య చికిత్సకు దోషి నుండే ఖర్చులు రాబట్టవచ్చు. అలాగే ప్రమాదం చేసిన వారు పారిపోకుండా బాధితులను ఆసుపత్రికి తరలిస్తే శిక్షల తీవ్రత తగ్గవచ్చు.

సామూహిక అత్యాచారానికి కొత్త చట్టం ప్రకారం మరణశిక్ష ఉండబోతోంది.

కలెక్టర్లుకు ఉండే మేజిస్ట్రేట్ అధికారాలను జిల్లా ఎస్పీలకు ఇవ్వనున్నారు. దీనితో నేరుగా ఉత్తర్వులు జారీ చేయవచ్చు.