InternationalNews

బ్రిటన్‌ను వెనక్కు నెట్టిన భారత్

Share with

బ్రిటన్‌ను వెనక్క నెట్టి భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో 5వ స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్ 6వ స్థానానికి చేరింది. ఒక దశాబ్దం క్రితం, భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 11వ స్థానంలో ఉండగా, బ్రిటన్ 5వ స్థానంలో ఉంది. భారతదేశం 2047 వ సంవత్సరం స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి “అభివృద్ధి చెందిన” దేశంగా అవతరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరుతున్న నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది. GDP పరంగా భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ ను మించిపోయి తొలిసారిగా ఐదో స్థానానికి చేరుకుంది. IMF గణాంకాల ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్త్రెమాసికంలో భారత్ బ్రిటన్‌ను వెనక్కి నెట్టి ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించిందని బ్లూమ్‌బర్గ్ కథనం పెర్కొంది. 2021 త్త్రెమాసికం చివరి నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 854.7 బిలియన్ డాలర్లుగా ఉండగా యూకే ఆర్థిక వ్యవస్థ 816 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. ఈ ఏడాది భారత కరెన్సీ రూపాయి విలువతో పోలిస్తే బ్రిటన్ కరెన్సీ పౌండ్ విలువ 8 శాతం మేర క్షీణించింది. ఇదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి నమోదుచేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 నుంచి 7.5 శాతం వృద్ధి నమోదవ్వచ్ఛని అంచనా వేయబడింది. 2021-22లో మన దేశం 8.7 శాతం వృద్ధిని నమోదు చేసింది.


భారత్ కంటే ముందు మెదటి స్థానంలో అమెరికా, రెండవ స్ధానంలో చైనా, తర్వాతి స్థానాల్లో జపాన్, జర్మనీ , ఉన్నాయి. బ్రిటన్ 6వ స్థానానికి పడిపోయింది. ప్రపంచంలో బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్ బ్రిటన్ వెనక్కు నెట్టి ఐదో ఆర్ధిక శక్తిగా అవతరించడంపై భారత్‌లోని వ్యాపారవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సెప్టెంబర్ 3న భారత్ ఆర్థికంగా బ్రిటన్‌ను అధిగమించి 5వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించటాన్ని ప్రశంసించారు. దేశ స్వాతంత్య్రం కోసం అహర్నిశలు పోరాడిన, త్యాగం చేసిన ప్రతి భారతీయుడి గుండెల్లో ఈ వార్త నిండి ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. “లా ఆఫ్ కర్మ” అంటే ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో అనేక మంది మహీంద్రా అభిప్రాయంతో ఏకీభవిస్తూ ప్రశంసిస్తున్నారు.