InternationalNews

బంగ్లా-భారత్‌ మధ్య 7 ఒప్పందాలు

Share with

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐటీ, అంతరిక్షం, అణుశక్తి తదితర రంగాల్లో పరస్పర సహకారం కోసం రెండు దేశాల మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ విషయాన్ని షేక్‌ హసీనా, మోదీ ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. భారత్‌లో బంగ్లాదేశ్‌ ప్రధాని నాలుగు రోజుల పర్యటనలో ఉన్నారు. బంగ్లాదేశ్‌ గత ఏడాది 50వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంది.

కుషియారా నది నుంచి నీటిని పంచుకోవడంపైనా రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భారత్‌లోని దక్షిణ అస్సాం, బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ ప్రాంతాలకు లబ్ధి చేకూరుతుంది. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో 54 నదులున్నాయి. స్నేహం ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుందని.. భారత్‌తో తమకు అలాంటి స్నేహమే ఉందని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా తెలిపారు.