Home Page SliderTelangana

తెలంగాణ ఎన్నికల బరిలో బీజేపీ హేమాహేమీలు..సీట్లు పక్కా..

Share with

రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో విజయం సాధించాలని బీజేపీ దృఢసంకల్పంతో ఉంది. ఎలాగైనా అసెంబ్లీలో  మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా హేమాహేమీలను రంగంలోకి దించింది. దాదాపు 31 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లే విశ్వసనీయ వర్గాల సమాచారం. కేసీఆర్‌పై పోటీ చేసి తీరతానని శపథం చేసిన ఈటల రాజేందర్‌కు ఆయన కోరినట్లే రెండుస్థానాలలో టిక్కెట్లు దొరికే అవకాశం ఉంది. హుజూరాబాద్, గజ్వేల్ నియోజక వర్గాల నుండి ఈటల పోటీ చేసే అవకాశం ఉంది. గెలుపు ఖాయమనుకున్న నేతలను ఎన్నికల బరిలో దించాలని పార్టీ యోచిస్తోంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కీలక శక్తిగా మారాలని భావిస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగా కసరత్తు తీవ్రతరం చేస్తోంది. అభ్యర్థుల ఎంపికతోనే పార్టీ విజయం సాధ్యమని భావిస్తున్న బీజేపీ పెద్దలు సీనియర్ నేతలను బరిలోకి దించాలని భావిస్తోంది.

నియోజక వర్గంఅభ్యర్థి నియోజక వర్గంఅభ్యర్థినియోజక వర్గంఅభ్యర్థి
హుజూరాబాద్, గజ్వేల్ఈటల రాజేందర్‌వేములవాడచెన్నమనేని వికాస్  ఉప్పల్  ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్
ఖానాపూర్ రమేశ్‌రాథోడ్  సిరిసిల్ల  రాణి రుద్రమదేవిగద్వాలడి.కె.అరుణ  
ఆదిలాబాద్పాయల్‌శంకర్నారాయణ్ ఖేడ్సంగప్ప  వికారాబాద్కొప్పు బాషా  
బోథ్సోయం బాపురావుఅందోలుబాబుమోహన్కల్వకుర్తిఆచారి  
కోరుట్లధర్మపురి అర్వింద్  పటాన్ చెరునందీశ్వర్ గౌడ్హుజూర్ నగర్శ్రీలతారెడ్డి  
కరీంనగర్బండి సంజయ్  దుబ్బాకరఘునందన్ రావుసూర్యాపేట  సంకినేని వెంకటేశ్వర్ రావు
చొప్పదండిబొడిగె శోభ  కుత్భుల్లాపూర్కూన శ్రీశైలం గౌడ్భువనగిరి  గూడూరు నారాయణరెడ్డి
జనగామ  దుష్యంత్ రెడ్డిస్టేషన్ ఘన్‌పూర్-విజయరామారావు  మహబూబాబాద్  హుస్సేన్ నాయక్
వరంగల్ వెస్ట్రావు పద్మ  వరంగల్ ఈస్ట్  ఎర్రబెల్లి ప్రదీప్ రావుభూపాల పల్లికీర్తిరెడ్డి  
నిర్మల్మహేశ్వర్ రెడ్డిధర్మపురిఎస్.కుమార్చెన్నూరుజి. వివేక్