Home Page SliderInternational

టీ20 ఫైనల్‌లో ఫస్ట్ బ్యాటింగ్ టీమ్‌కే విజయావకాశాలు

Share with

నేడు టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ బార్బిడోస్ వేదికగా జరగనుంది. భారత్, సౌతాఫ్రికాల మధ్య జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన టీమ్‌కే గెలిచే అవకాశాలుంటాయని పాత రికార్డులు చెప్తున్నాయి.  బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో టీ 20 చరిత్రలో 50 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో 31 మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 125 మాత్రమే ఉండగా, ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 138 ఉంది. అత్యధిక స్కోరు 224, అత్యల్ప స్కోర్ 43గా ఉంది. డిఫెండ్ చేసుకున్న లోయెస్ట్ స్కోర్ 106 కాగా, చేధించిన అత్యధిక స్కోర్ 172 ఉంది. దీనితో భారత్‌కే మొదట బ్యాటింగ్ చేసే అవకాశం రావాలంటూ టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. 2023లో ఫైనల్లో ప్రపంచకప్‌ను తృటిలో చేజార్చుకున్న రోహిత్ సేన ఈ పొట్టి కప్‌నైనా గెలవాలని బలంగా కోరుతున్నారు.