Home Page SliderTelangana

పత్రికలో వచ్చిన వార్తకు స్పందనగా మంత్రి సీతక్క ఊరికి బస్సు

Share with

ములుగు: మంత్రి సీతక్క స్వగ్రామమైన ములుగు జిల్లాలోని జగ్గన్నపేటకు ఎట్టకేలకు బస్సు రానుంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు బుధవారం ఆ మార్గంలో సర్వే చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి స్వగ్రామానికి రోడ్డుమార్గం ఉన్నా ఆర్టీసీ బస్సులు నడపడం లేదని ఈ నెల 12న ములుగు జిల్లా ఒక పత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన రోడ్డు రవాణా శాఖ అధికారులు రూట్ సర్వే చేశారు. ఈ విషయంపై వరంగల్-2 డిపో మేనేజర్ సురేష్‌ను వివరణ కోరగా ఆ మార్గంలో బస్సు సౌకర్యం కల్పించేందుకు సర్వే చేశారని.. త్వరలో బస్సు నడిపిస్తామని తెలిపారు. పత్తిపల్లి- పొట్లాపూర్ మార్గంలో బస్సులు ఇకపై నడుపుతామని ఆర్టీసీ అధికారులు హామీ ఇచ్చారు.