Andhra PradeshHome Page Slider

“ఏపీలో అధికారం ఇచ్చిన రైతులే కుర్చీ దింపేస్తారు”: ఏపీ బీజేపీ ఛీఫ్

Share with

ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్థన్ రెడ్డి జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయింది 47, 999 మంది రైతులేనా ? అని ఆయన ప్రశ్నించారు. అయితే వారికి ఇచ్చే పరిహారం రూ. 44 కోట్లేనా ? అందులోనూ ఇన్ పుట్ సబ్సిడీ పేరుతోనా అని ఆయన జగన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మరి ఈ అకాల వర్షాలకు సర్వం కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఏంసాయం చేసిందన్నారు. పంట నష్టం జరిగినప్పుడు కనీసం పలకరించని సీఎం .. చివరికి రైతులను ఇలా ముంచేస్తారా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్ని ఇలా గాలికొదిలేసిన ప్రభుత్వం చరిత్రలో ఉండదేమో అన్నారు. కాగా ఏపీ ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి పంట నష్టం ఎన్యూమరేషన్ వివరాల్ని బహింరగపరిచాలన్నారు. అంతేకాకుండా ఎకరానికి రూ. 20,000 /- పరిహారం ప్రకటించాలని బీజేపి డిమాండ్ చేస్తోందన్నారు. అలా జరగని పక్షంలో అధికారం ఇచ్చిన రైతులే కుర్చీ దింపేస్తారని ఎస్. విష్టువర్థన్ రెడ్డి హెచ్చరించారు.