Andhra PradeshHome Page Slider

ఏపీలో ప్రారంభమైన ట్రిపుల్ఐటీ(IIIT) కౌన్సిలింగ్

Share with

ఏపీలో ఇటీవల ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదలయిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు  ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రారంభమయ్యింది. కాగా RGUKT పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2023-2029 విద్యాసంవత్సరానికి ఈ నెల 20 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు ఈ రోజు నుంచి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు జూలై 25 వరకు కౌన్సిలింగ్ జరగనుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 ట్రిపుల్ ఐటీల్లో మొత్తం 4,400 సీట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఈ కౌన్సిలింగ్‌కి వచ్చే  విద్యార్థులు తమ వెంట పదవ తరగతి ఒరిజినల్,కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.