Home Page SliderInternational

అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీచేస్తే.. నేను పోటీ చేస్తా: బైడెన్

Share with

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బుధవారం అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రచారం కోసం నిధులు సేకరిస్తున్న తరుణంలో బోస్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి బైడెన్ మాట్లాడారు. ట్రంప్ పోటీలో లేకపోతే.. నేను పోటీ చేస్తానో లేదో కచ్చితంగా తెలియదు. కానీ ఆయన్ని మాత్రం గెలవనివ్వం అంటూ ఒక్కసారిగా అధ్యక్ష ఎన్నికలను రసవత్తరంగా మార్చేశారు. రెండోసారి ట్రంప్ అధ్యక్షుడు అయితే దేశం నిరంకుశ పాలనలోకి వెళ్లే ప్రమాదం ఉందంటూ వ్యాఖ్యలు చేసిన రిపబ్లికన్ సెనెటర్ లిజ్ చెలీని బైడెన్ అభినందించారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు బైడెన్, ట్రంప్‌లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.