Home Page SliderNational

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, బజరంగ్ దళ్ నిషేధం

Share with

కులం లేదా మతం ఆధారంగా వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలపై కఠినమైన, నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. మే 10న కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి.ఎఫ్‌.ఐ)తో సమానంగా, సంఘ్ అనుబంధ విశ్వహిందూ పరిషత్ యువజన విభాగం అయిన బజరంగ్ దళ్‌తో నిషిధిస్తామని పేర్కొంది. మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం లేదా ద్వేషం, దేశానికి ప్రమాదమని చెప్పింది. చట్టం, రాజ్యాంగం పవిత్రమైనవని… ప్రజల మధ్య విద్వేషాన్ని రాజేయడం దారుణమని, భజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలు లేదా వ్యక్తుల ఉల్లంఘనలు దేశానికి మంచిది కాదని పేర్కొంది. మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం లేదా ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్న ఇతరులపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, నిషేధం విధించడంతోపాటు చట్టం ప్రకారం ‘నిర్ణయాత్మక చర్య’ తీసుకుంటామని మేనిఫెస్టోలో స్పష్టం చేసింది.