Home Page SliderTelangana

బీఆర్ఎస్‌ను గెలిపిస్తే.. ప్రజల సొమ్ము దోచుకుంటారు: అమిత్‌షా

Share with

హైదరాబాద్: తెలంగాణలో భూముల వేలంలో రూ.4 వేల కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజు వేలంలో, కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. సోమాజీగూడలో అమిత్ షా మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది. లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తామని గొప్పగా చెప్పారు.. పూర్తి చేయలేదు. ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ చేసి విద్యార్థుల బతుకులతో ఆటలాడుకున్నారు. సుస్థిరమైన పాలన కావాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించమని ఓటర్లను కోరిన అమిత్‌షా.