Home Page SliderInternational

స్త్రీలు ఏడిస్తే వచ్చే కన్నీటి వాసన పురుషుడు పీలిస్తే శాంత స్వభావుడౌతాడు..

Share with

మహిళల కన్నీటి వాసన పురుషుల్లో దూకుడు స్వభావాన్ని తగ్గించేస్తుంది. ఔనండీ నిజమే. శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. ఆడవాడి కన్నీటి వాసన.. మగవారిపై చూపే ప్రభావంపై ఇజ్రాయెల్‌కు చెందిన వీజ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. మహిళల కన్నీళ్లలోని రసాయనాలు పురుషుల మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని తేల్చారు. ఇవి మగవాళ్ల దూకుడుకి కళ్లెం వేస్తాయని అంటున్నారు. మీరెప్పుడైనా గమనించారా? కన్నీళ్ల వాసన పీలిస్తే ఎంత దూకుడుగా ఉండే మగవాడికైనా కళ్లెం పడిపోతుందట. శాంతస్వభావులుగా మారిపోతారు.