Home Page SliderNational

‘కేరళస్టోరీ రేప్‌సీన్‌లో మా అమ్మమ్మ గురించి చాలా నెర్వస్ అయ్యా’

Share with

కేరళస్టోరీ రేప్‌సీన్‌లో మా అమ్మమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో అని చాలా నెర్వస్ అయ్యానని పేర్కొంది ఈ చిత్ర హీరోయిన్ అదాశర్మ. 200 కోట్లకు పరుగులు పెడుతున్న సూపర్ హిట్ చిత్రం కేరళస్టోరీలో కొన్ని సీన్లలో ఇంట్లోవారి గురించి, ముఖ్యంగా రేప్ సీన్ గురించి చాలా టెన్షన్ పడ్డానని అదాశర్మ చెప్పింది. ఈ చిత్రంలో ఆమె ఐసిస్ ఉగ్రవాదులచే  బ్రెయిన్ వాష్ చేయబడి, ఇస్లాం మతం స్వీకరించిన హిందూ మహిళగా కనిపిస్తారు. ఈచిత్రంలో ఆమె పేరు షాలిని ఉన్నికృష్ణన్.

ఎందరో హిందూ యువతులను మాయమాటలు చెప్పి, లవ్ జిహాది పేరుతో కుట్ర చేసి, మతమార్పిడులు చేసి, అరబ్బు దేశాలకు వారిని విక్రయించే టెర్రరిస్ట్ గ్యాంగ్ కథే ఈ కేరళ స్టోరీ. తన ఇంట్లోని వారందరూ ఈ చిత్రాన్ని చూసారని, తన తల్లి, అమ్మమ్మఈ చిత్రం గురించి ఎలా రియాక్టవుతారో అంటూ భయపడ్డానని, ముఖ్యంగా తన అమ్మమ్మ ఏమంటుందో అని నెర్వస్ అయ్యానని పేర్కొన్నారు అదా శర్మ. కానీ ఆమె ఈ చిత్రాన్ని చూసి, చాలా బాగుందని చాలా ఇన్‌ఫర్‌మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందని పేర్కొందిట. వాళ్ల అమ్మమ్మ ఒపీనియన్ తనకు చాలా ముఖ్యమని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని సంబరపడింది అదాశర్మ.