Home Page SliderNational

‘నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లారు’..రాజమౌళి

Share with

నేడు విడుదలైన కల్కి సినిమాపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఈ చిత్రాన్ని జక్కన్న రాజమౌళి కూడా మెచ్చుకున్నారు. తాను సినిమా చూస్తున్నప్పుడు చివరి 30 నిముషాలు మరో ప్రపంచంలోకి వెళ్లిపోయినట్లుందని వ్యాఖ్యానించారు.  ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఉందని మెచ్చుకున్నారు. కల్కి ప్రపంచం తనకెంతో నచ్చిందన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ ప్రయత్నం అద్భుతంగా ఉందన్నారు. ప్రభాస్ టైమింగ్ అదిరిపోయిందని, అమితాబ్, కమల్, దీపిక నటనలో జీవించేశారని పేర్కొన్నారు.