Home Page SliderNational

‘ఫస్ట్‌డే ఫస్ట్‌షో చూడాలనుంది’..రాజమౌళి

Share with

‘కల్కి’ చిత్రం ట్రైలర్‌పై దర్శక ధీరుడు రాజమౌళి స్పందించారు. ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే ఫస్ట్‌డే ఫస్ట్‌షో చూడాలనుంది అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ చిత్ర ట్రైలర్‌లో కమల్ హసన్ లుక్స్ చాలా స్టన్నింగ్‌గా ఉన్నాయని ఆయనను చూస్తూ అలాగే ఉండిపోయానని పేర్కొన్నారు. అమితాబ్, ప్రభాస్, దీపిక పాత్రలలో ఇంకా ఏదో ఉందని దానిని ట్రైలర్‌లో రిలీవ్ చేయకుండా రహస్యంగా ఉంచారన్నారు. ఈ చిత్రంలో కల్కి ప్రపంచాన్ని చూడడానికి చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నానని కామెంట్ పెట్టారు. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా జూన్ 27న ప్రేక్షకుల ముదుకు రానుంది. అమితాబ్, దీపిక పదుకొణె, కమల్ హాసన్ ముఖ్యపాత్రలలో కనిపిస్తున్నారు.