Home Page SliderNational

నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను:దుల్కర్ సల్మాన్

Share with

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవల విడుదలైన సీతారామం సినిమాతో తెలుగులో సూపర్‌హిట్ అందుకున్నారు. గతంలో దుల్కర్ సల్మాన్ మహనటి సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కాగా దుల్కర్ సల్మాన్ తాజాగా ఓ భావోద్వేగ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. తొలిసారి నేను ఓ సంఘటనను ఎదుర్కొన్నాను. అప్పటినుంచి పరిస్థితులు మారిపోయాయి. దానివల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. ఆ ఘటన నా మైండ్‌లో నుంచి వెళ్లట్లేదు అని ఎమోషనల్ అయ్యారు. అయితే పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆ వీడియోను దుల్కర్ డిలీట్ చేశారు. దీంతో దుల్కర్ సల్మాన్‌కి  ఏమైంది అని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.