Home Page SliderTelangana

హుజూరాబాద్: ఘన్ముక్కుల ఎన్నికల ప్రచారంలో-ఈటల

Share with

హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం ఘన్ముక్కుల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్.

ఒకప్పుడు హుజూరాబాద్ అడుక్కునే స్థితిలో ఉంటే ఇప్పుడు.. నా హుజూరాబాద్‌కి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం రాబోతుంది. చదువుకున్న వాడికి కాదు పైరవీ చేసుకున్న వారికి ఉద్యోగం వస్తుంది అని తేల్చిన దుర్మార్గుడు కేసీఆర్. నౌకర్లు రాక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకనాడు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తే ఇప్పుడు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ ఆత్మహత్యలు ఆగడానికి బీజేపికి ఓటు వెయ్యమని అడుగుతున్నాం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చే జెమ్మీదార్ మాది.

గ్రామాల్లో కడుతున్న గ్రామపంచాయితీ భవనాలు, పెడుతున్న చెట్లు, చివరకు సఫాయి కార్మికుల జీతాలు కూడా కేంద్రమే ఇస్తోంది. 20 ఏళ్లుగా మీ ప్రేమ సంపాదించుకున్న. హుజూరాబాద్ ప్రజల మీద ఈసారి చాలా బాధ్యత ఉంది. లక్షా 20 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం కుంగిపోయింది. మన డబ్బులు గోదారిపాలు చేసిన కేసీఆర్‌ను ఓడించడమే నా లక్ష్యం.