Home Page SliderNational

నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం-భవనంపై నుండి దూకిన జనం

Share with

దిల్లీ శివార్లలోని  గ్రేటర్ నోయిడాలో గాలక్సీప్లాజా అనే భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుండి తప్పించుకునే ప్రయత్నంలో కొందరు పై అంతస్తుల నుండి కిందకు దూకేశారు. దీనితో వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు చాలా ఎత్తు నుండి వ్రేలాడుతూ కొంతసేపు ఉన్నారు. అనంతరం కిందకు దూకడంతో వారిలో ఒకరికి తలకు, వెన్నెముకకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అగ్నిమాపక సిబ్బంది అతికష్టంతో ఆ మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.