Home Page SliderTelangana

పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుండే…

Share with

తెలంగాణ పోలీస్ వాహన దారులకు పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ డిస్కౌంట్‌ను నేటి నుండే అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్లపై, ఆటోలపై, టూవీలర్లపై ఉన్న పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ పెట్టడంతో గత సంవత్సరం దాదాపు రూ.300 కోట్లు వసూలయ్యింది. ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఆటోలు,టూ వీలర్లపై 80 శాతం, కార్లపై 60 శాతం డిస్కౌంటును ప్రకటించారు. దీనితో జోరుగా పెండింగ్ చలాన్లు వసూలవుతాయని ఆశిస్తున్నారు రవాణా శాఖ.