Home Page SliderTelangana

‘మేము ఫేమస్’ ఇంత సూపర్‌గా కొత్తవాళ్లు ఎలా తీసారబ్బా-మహేష్

Share with

సుమంత్ ప్రభాస్ దర్శకత్వంలో వచ్చిన కొత్త సినిమా ‘మేమ్ ఫేమస్’ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ చిత్రాన్ని ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఇది మే26 (శుక్రవారం) విడుదల కాబోతోంది. ఈ చిత్రం అదిరపోయిందని, కొత్తవాళ్లు తీసారంటే నమ్మలేక పోతున్నానని, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉందని మహేశ్ బాబు ట్వీట్ చేయడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రంలో అందరూ బాగా నటించారని, వాళ్ల వాళ్ల పాత్రలకు న్యాయం చేశారని మహేశ్ తన అభిప్రాయం వెలిబుచ్చారు. మహేశ్ అభిమానులు ఆయనపై కొత్తవారిని ప్రోత్సహించడంలో ముందుటారని కామెంట్స్ పెడుతున్నారు. మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి గుంటూరు కారం , అమరావతి అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు కూడా వందల కోట్లు రాబడుతున్నాయి. అలాగే ఈ మేము ఫేమస్ చిత్రం సూపర్ హిట్ అవుతుందని ప్రముఖులు చెప్తున్నారు.