Home Page SliderInternational

క్రికెట్ అభిమానులకు హాట్‌స్టార్ కానుక

Share with

క్రికెట్ అభిమానులకు హాట్‌స్టార్ కానుకనివ్వబోతోంది. ఉచితంగా హాట్‌స్టార్‌లో క్రికెట్ దర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సంవత్సరం జరుగబోయే ఆసియాకప్, వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటించింది హాట్‌స్టార్. అయితే ఈ అవకాశం కేవలం మొబైల్‌లో వీక్షించేవారికి మాత్రమే పరిమితమని, టీవీలకు, కంప్యూటర్లకు వర్తించదని తెలియజేసింది. ఈ సెప్టెంబర్‌నుండి ఆసియా కప్, అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే వరల్డ్ కప్ జరుగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మ్యాచ్‌లు ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ కానున్నట్లు హాట్‌స్టార్ ప్రకటించింది. దీనితో ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం అభిమానులకు కలుగబోతోంది.