Home Page SliderTelangana

కాకతీయ యూనివర్సిటీలో హై టెన్షన్

Share with

TSPSC పేపర్ లీకేజి విషయంలో కాకతీయ యూనివర్సిటీలో ఈ రోజు ఉదయం నుండి విద్యార్థులు ఆందోళనలు ఉద్ధృతం చేశారు. ఈ విషయంలో సీబీఐ విచారణకు ఆదేశించాలని, ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన వారని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆవేశపూరితమైన ఘర్షణలు ఎక్కువ కావడంతో, పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాటలు జరగడంతో విద్యార్థి సంఘాల నేతలను పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరోపక్క ABVP కూడా హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీ ఎదుట ఆందోళనలు చేస్తోంది. పేపర్ లీకేజి జరిగి ఇన్ని రోజులయినా ఇంకా ఈ విషయంలో క్లారిటీ రాలేదని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్లు చేస్తున్నారు. కేసులకు, జైళ్లకు భయపడమని, కష్టపడి పోటీ పరిక్షలకు సిద్దమైన విద్యార్థుల భవిష్యత్తుతో వ్యాపారాలు చేస్తున్నారని, లక్షల మంది విద్యార్థులను అరెస్టు చేసినా తగ్గేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని, TSPSC చైర్మన్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.