Home Page SliderTelangana

IIT అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్‌లో హైటెక్ కాపీయింగ్

Share with

దేశవ్యాప్తంగా జరిగిన ఐఐటీ ఎంట్రన్స్ అడ్వాన్స్ ఎగ్జామ్‌లో హైటెక్ కాపీయింగ్ జరిగింది. ఒక టాపర్‌తో పాటు మరో ముగ్గురు విద్యార్థులు ఏకంగా ఐఐటీ అడ్వాన్స్‌డ్ పరీక్షలలోనే కాపీయింగ్‌కు తెగించారు. కడపకు చెందిన కృష్ణచైతన్య అనే విద్యార్థి దీనికి మూల కారణం. ఇతడు టెన్త్ క్లాస్‌లోనూ, ఇంటర్‌లోనూ టాపర్ కావడంతో తన దోస్త్‌లకు కూడా హెల్ప్ చేద్దామనుకున్నాడు. హైటెక్ లెవెల్లో ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసుకుని సెల్‌ఫోన్లతో ఎగ్జామ్ సెంటర్‌లో అడుగుపెట్టారు. ఈ నలుగురు నాలుగు సెంటర్లలో ఎగ్జామ్ రాస్తున్నారు. ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, మౌలాలీ, మల్లేపల్లిలో ఒకరు పరీక్ష రాస్తున్నారు.

ఈ ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో కృష్ణచైతన్య తన ఆన్సర్స్ బబుల్ చేసిన వెంటనే వాటిని ఫొటో తీసి, వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. మిగిలిన ముగ్గురూ వాటిని కాపీ చేస్తున్నారు. అయితే ఎల్‌బీ నగర్‌లో ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థిపై ఇన్‌విజిలేటర్‌కు అనుమానం రావడంతో విద్యార్థి వద్ద సెల్‌ఫోన్ తీసుకుని, వాట్సాప్ గ్రూప్‌లో చెక్ చేయగా, అసలు విషయం బయటపడింది. దీనితో ఎగ్జామినర్ మార్కెట్ సెంటర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీరు సెల్‌ఫోన్లతో పరీక్షా కేంద్రంలో ఎలా ప్రవేశించారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్న ఐఐటీ గౌహతి వీరిని అనర్హులుగా ప్రకటించింది. వీరందరూ మైనర్లు కావడంతో పోలీసులు వీరికి నోటీసులు ఇచ్చి పంపించారు. విచారణకు హాజరు కమ్మని ఆదేశించారు. వీరు నలుగురిపై 420 కేసు, మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేశారు.