Andhra PradeshHome Page Slider

ఏపీ మంత్రి విడదల రజినీకి హైకోర్టు నోటీసులు

Share with

ఏపీ మంత్రి విడదల రజినీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చిలకలూరిపేట నియోజకవర్గంలోని మురికిపూడిలోని 21.5 ఎకరాల్లో గ్రానైట్ తవ్వకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించి మంత్రికి నోటీసులు ఇచ్చింది. గ్రానైట్ తవ్వకాలపై ఎన్వోసీ ఎలా ఇస్తారంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో డీకే పట్టాలు రద్దు చేయకుండానే గ్రానైట్ తవ్వకాలు చేస్తున్నారని పిటిషన్‌దారులు తరపున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అభ్యంతరాలు విన్న కోర్టు గ్రానైట్ తవ్వకాలపై స్టేటస్ కో విధించింది. ఇదే కేసులో ఎపీ అవినాష్ రెడ్డి బంధువులు ప్రతాప్ రెడ్డి, శ్వేతా రెడ్డి, జీవీ దినేష్ రెడ్డి, శివపార్వతికి కూడా కోర్టు నోటీసులు పంపించింది. విచారణను వచ్చే నెల 10కి కోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి తవ్వకాలు జరపరాదని తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా మంత్రి రజినీతోపాటు, అవినాష్ రెడ్డి బంధువులను కోర్టు ఆదేశించింది.