Home Page SliderNational

రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్ తాప్సీ?

Share with

హీరోయిన్ తాప్సీ తన ప్రియుడు మథియాస్‌ బోను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 23న ఉదయ్‌పూర్‌లో అతి కొద్దిమంది స్నేహితుల సమక్షంలో వారి వివాహం జరిగినట్లు సమాచారం. బాలీవుడ్ నుండి పలువురు నటీనటులు ఈ పెళ్లి వేడుకలకు హాజరైనట్లు తెలుస్తోంది. మథియాస్‌తో గత పదేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు తాప్సీ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.