Home Page SliderNational

సౌతిండియా సినిమా పండుగ “సైమా” నామినేషన్స్ ఇవే

Share with

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్( సైమా)2023 కి పోటీపడే చిత్రాల జాబితా విడుదలయ్యింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలంలో పలు చిత్రాలు నామినేషన్లు దక్కించుకున్నాయి. తెలుగులో అత్యధికంగా ఆస్కార్ పొందిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం 11 కేటగిరీలలలో నామినేషన్లు పొందింది. తర్వాత 10 కేటగిరీలతో సీతారామం చిత్రం రెండవస్థానంలో నిలిచింది. ఉత్తమ చిత్రంగా ఆర్ ఆర్ ఆర్ తో పాటు డీజే టిల్లు, కార్తికేయ 2, మేజర్, సీతారామం పోటీపడుతున్నాయి.

తమిళంలో పొన్నియన్ సెల్వన్-1కి 10 నామినేషన్లు రాగా, విక్రమ్ చిత్రానికి 9 నామినేషన్లు దక్కాయి. కన్నడలో బాక్సాఫీస్ హిట్ చిత్రం కాంతార, కేజీయఫ్-2 చిత్రాలకు 11 నామినేషన్లు దక్కాయి. ఇక మళయాళంలో మమ్ముట్టి నటించిన  భీష్మపర్వం చిత్రానికి 8 నామినేషన్లు వచ్చాయి. మళయాళంలో ఉత్తమచిత్రానికి ఆరు సినిమాలు పోటీలో ఉన్నాయి. ఈ వేడుకలు సెప్టెంబరు 15,16 తేదీలలో దుబాయిలోని డి.డబ్ల్యూ.టి.సిలో జరుగనున్నాయి.