Home Page SliderTelangana

హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన  భారీ వర్షాలు

Share with

తెలంగాణాలో మొన్నటి వరకు భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. కాగా నిన్నటి నుంచి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో తెలంగాణాలోని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణా రాజధాని హైదరాబాద్‌లో ఈ రోజు మళ్లీ భారీ వర్షం ప్రారంభమైంది. నగరంలోని జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి,బంజారాహిల్స్,బాలానగర్,ఆల్వాల్,కుత్బుల్లాపూర్,టోలీచౌకి,కూకట్‌పల్లి,సనత్‌నగర్,భరత్‌నగర్,మియాపూర్,పటాన్‌చెరు,న్యూ బోయిన్‌పల్లి,కొంపల్లి సహా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో వాతావరణశాఖ అధికారులు హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.