Home Page SliderTelangana

నేడు,రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..బీ అలర్ట్

Share with

తెలంగాణా రాష్ట్రానికి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. కాగా  నేడు,రేపు తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తాజాగా వెల్లడించింది. అయితే నేడు హైదరాబాద్ ,మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు వర్షాలు పడతాయని వాతావరణశాఖ ప్రకటించింది. కాగా రేపు భద్రాద్రి, మహబూబ్‌నగర్, వరంగల్, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, యాదాద్రి, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు తెలంగాణా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.