Home Page SliderNational

కేరళలో కరోనాపై ఆరోగ్యమంత్రి కీలక అప్‌డేట్

Share with

కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జి కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తిపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. కరోనా వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి విషయంలో ఆందోళన పడవద్దని, వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నా, తీవ్రత తక్కువగానే ఉందన్నారు. నేడు కేరళలోని కరోనా పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు. ఈ కొత్త కరోనా వైరస్ చాలా బలంగా ఉందని, కేసులు త్వరగా వ్యాప్తి చెందుతున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో కేరళలో వీటిని అదుపు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. నవంబరులోనే 79 ఏళ్ల వృద్ధురాలికి కరోనా జేఎన్.1 వైరస్ సోకగా, ఆమె ఇంట్లోనే చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నారని పేర్కొన్నారు. కొవిడ్ పరీక్షలు ఎక్కువగా చేస్తున్నామని, ఎవ్వరూ ఆందోళనకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. దీర్ఘకాలికి అనారోగ్యాలు ఉన్నవారికే ఈ వైరస్ సోకుతోందని, ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియజేశారు.