Home Page SliderNational

ఆయనను ఎంపీగా తొలగించాలి..రాష్ట్రపతికి లేఖ

Share with

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఎంపీగా అనర్హునిగా ప్రకటించాలంటూ న్యాయవాది హరిశంకర్ రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు లేఖ రాశారు. భారతదేశం యొక్క సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడేందుకు కృషి చేస్తామని ప్రమాణం చేసిన ఒక ఎంపీ ఇతరదేశాలకు ఎలా విధేయునిగా ఉంటానని ప్రమాణస్వీకార సమయంలో ప్రకటించాడు. అది ఎంతటి పాపం, ఘోరం అని హరిశంకర్ లేఖలో పేర్కొన్నారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఓవైసీ జై పాలస్థీనా అని నినాదం చేయడంపై ఆయన ఇతర దేశానికి విధేయునిగా ఉన్నట్లు భావించవలసి ఉంటుందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102స్లాజ్ 1(డి)లో ప్రజాప్రతినిధులు ఇతర దేశానికి విధేయునిగా ఉన్నట్లయితే అతనిని అనర్హునిగా ప్రకటించే అధికారం ఉందని ఆయన తెలిపారు.