NewsSports

విరాట్ కోహ్లీకి అతడే హీరో

Share with

తన ఆల్‌టైమ్ ఫేవరెట్ హీరో సచిన్ టెండూల్కరేనని స్పష్టం చేశారు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. తన దృష్టిలో ప్రపంచ క్రికెట్ చరిత్రలో తాను ఆరాధించే, అనుసరించే క్రికెటర్లు ఇద్దరేనని, వారు ఒకరు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ ఐతే, మరొకరు వివ్ రిచర్డ్స్ అని పేర్కొన్నారు. వారిద్దరి ఆటల్లో గొప్ప గ్రేస్ ఉంటుందని, వారి తరంలో క్రికెట్ స్వరూపాన్నే వారు మార్చేశారని, అందుకే వాళ్లు గొప్ప క్రికెటర్లుగా పేరుపొందారని అన్నారు. ఇంకా తన కుమార్తె వామిక ఫొటోలు తన ఫోన్ అంతటా నిండిపోయాయని, తన ఫ్యామిలీతో గడిపే మధురక్షణాలను కెమెరాలో పదిలం చేసుకుంటానని ఇంటర్యూలో తెలిపారు విరాట్ కోహ్లీ.