Home Page SliderNational

“సితార” ప్రిన్సెస్ యాడ్ ఫిల్మ్ చూశారా?

Share with

సూపర్‌స్టార్ మహేష్‌బాబు కూతురు సితార ఓ ప్రముఖ జ్యూవెలరీ సంస్థకు చెందిన  యాడ్‌లో నటించిన విషయం తెలిసిందే.కాగా  ఈ యాడ్‌ను PMJ జ్యూవెలరీ సంస్థ  ముందుగా అమెరికాలోని టైమ్స్ స్కేర్‌లో లాంఛ్ చేసింది. అయితే దీనికి సంబంధించిన యాడ్ ఫిల్మ్‌ను PMJ జ్యూవెలరీ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ యాడ్ ఫిల్మ్‌లో ఓ ప్రిన్సెస్ ఎలా క్వీన్‌గా మారుతుందో  సృజనాత్మకంగా, అందంగా చూపించారు. దీంతో ఈ యాడ్ ఫిల్మ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ సితారా యాక్టింగ్ సూపర్ అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.