NationalNews Alert

సూపర్ స్టార్ మహేశ్ న్యూ లుక్ చూశారా?

Share with

తన తల్లి ఇందిరాదేవి మరణం కారణంగా కొంత కాలం షూటింగ్‌కు దూరంగా ఉన్న మహేశ్ తిరిగి రోజు వారీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. రాబోయే సినిమా కోసం కొత్త స్టైల్లో కనిపిస్తున్నాడు మహేశ్. ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ అలీమ్ హకీమ్ ద్వారా హెయిర్ స్టైల్ సెట్ చేయించుకున్నారాయన. ఈ ఫొటోని అలీమ్ ఇన్‌ష్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘నిశ్శబ్దంగా ఉండండి. మన సూపర్ స్టార్ మహేశ్ బాబు వచ్చేస్తున్నారంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. సర్కారు వారి పాట తర్వాత మహేశ్ బాబు చేయబోతున్న ఈ సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై , పూజాహెగ్డే కథానాయికగా రాబోతోంది. దీనిలో  మహేశ్‌బాబు తన న్యూ హాట్ లుక్స్‌తో అభిమానుల మతి పోగొడుతున్నారు.