Home Page SliderNationalTrending Today

నితిన్, శ్రీలీలల ‘ఎక్స్‌ట్రా’ సాంగ్ చూశారా?

Share with

సక్సెస్ స్టార్ నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఎక్స్‌ట్రా’ నుండి ‘డేంజర్ పిల్లా’ అనే సాంగ్ రిలీజయ్యింది. ఈ చిత్రానికి ‘ఆర్డినరీ మ్యాన్’ అనే ట్యాగ్‌లైన్ చేర్చారు. డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది. సినిమాలపై ఆసక్తి ఉన్న యువకుడి కథను ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ డేంజర్ పిల్లా పాటను అర్మాన్ మాలిక్ ఆలపించారు. ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అందించారు. నితిన్ హీరోగా నటించిన చిత్రాలు సక్సెస్ రేటు బాగా ఉండడంతో ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా దాదాపు 8 చిత్రాలలో వరుసగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఈ చిత్రంపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి.