Home Page SliderNational

కొత్త సినిమాలో బాలయ్య మాస్ లుక్ చూశారా?

Share with

నందమూరి నటసింహం బాలకృష్ణ,డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్‌ “భగవంత్ కేసరి” అని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా గిప్పటి సంది ఖేల్ అలగ్ అంటూ “భగవంత్ కేసరి” గా టైటిల్‌ను అనిల్ రావిపూడి పోస్ట్ చేశారు. కాగా ఈ టైటిల్‌కు ఐ డోన్ట్ కేర్ అనే క్యాప్షన్‌ను పోస్టర్‌లో చూపించారు. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. హీరోయిన్ శ్రీలీల కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి,బాలయ్య కాంబోలో వస్తున్న ఈ సినమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం విడుదలైన ఈ పోస్టర్ అంచనాలను మరింతగా పెంచింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.