Home Page SliderTelangana

తెలంగాణ బీజేపీలో అసంతృప్తి చల్లారిందా ? కుమ్ములాటలు కొలిక్కి వచ్చాయా?

Share with

తెలంగాణ బీజేపీలో అంతర్గత విబేదాలు రాజుకుంటున్నాయి. అసంతృప్తిగా ఉన్న నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డిలను దిల్లీకి పిలిపించి, బుజ్జగించే ప్రయత్నం చేశారు బీజేపీ హైకమాండ్.  ఈటల హోం మంత్రి అమిత్ షాను కలిసి, తన అసంతృప్తిని వెల్లిబుచ్చుకున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు తిప్పికొట్టకపోతే ప్రమాదమని నిక్కచ్చిగా చెప్పేసారు ఈటల. శనివారం నాడు నడ్డా, అమిత్ షాలతో భేటీ అయ్యారు వీరు. సరైన సమయంలో సరైన బాధ్యతలు అప్పగిస్తామంటూ వీరిని చల్లబరిచారు అమిత్ షా. ఈటల హైదరాబాద్ వచ్చినా, కోమటిరెడ్డి ఇంకా దిల్లీలో ఉండిపోయారు. ఈ విషయంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  అయితే బీజేపీ అధ్యక్షుడు నడ్డా వైఖరి మరోలా ఉంది. అసలే వీరు బండి సంజయ్‌పై విబేధాలతో ఉంటే నాగర్ కర్నూల్ సభలో బండి సంజయ్‌ను ఆకాశానికి ఎత్తేలా మాట్లాడారు నడ్డా. బీఆర్‌ఎస్‌తో ఎలాంటి ఒప్పందాలు లేవని, బీఆర్‌ఎస్ పార్టీని గద్దెదించడమే లక్ష్యమని పేర్కొన్నారు నడ్డా.